Phethai: అమరావతిలో వర్షం... మళ్లీ జగన్ చాంబర్లోకి నీరు!

  • పెథాయ్ ప్రభావంతో వర్షాలు
  • జగన్ గదిలోకి పైకప్పు నుంచి నీరు
  • ఫైళ్లను మరో గదిలోకి మార్చిన సిబ్బంది
పెథాయ్ తుపాను ప్రభావంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీలోని విపక్ష నేత వైఎస్ జగన్ చాంబర్ లోకి మరోసారి వర్షపు నీరు వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది ఫైళ్లను మరో గదిలోకి మార్చారు. ఈ సంవత్సరం మేలో, అంతకుముందు ఇదే చాంబర్ లోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గదిలో పైకప్పు నుంచి వర్షం నీరు కారుతోంది.

 కాగా, ఇప్పటికే అసెంబ్లీ నిర్మాణం నాసిరకంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిపాటి వర్షానికే నీరు లోపలికి వస్తున్న పరిస్థితి నెలకొంది. జగన్ చాంబర్ తో పాటు, గతంలో స్పీకర్ కోడెల, మంత్రులు ప్రత్తిపాటి, గంటా శ్రీనివాస్ చాంబర్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది.
Phethai
Jagan
Assembly
Amaravati
Velagapudi

More Telugu News