పోలవరం ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు.. జనవరి 4న ప్రదానం!
- పోలవరాన్ని అత్యుత్తమ ప్రాజెక్టుగా గుర్తించిన సీబీఐపీ
- ఏపీ ప్రభుత్వాన్ని గౌరవించేలా అవార్డు
- ఏపీ సర్కారుకు ఈమెయిల్ ద్వారా తెలిపిన సీబీఐపీ
ప్రాజెక్టును నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని గౌరవించేలా ఈ అవార్డును అందజేయాలని జ్యూరీ నిర్ణయించినట్టు సీబీఐపీ కార్యదర్శి వీకే కాంజ్లియా తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు సర్కారుకు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 4న నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి, లేదంటే ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డును అందించనున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో జలవనరులు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, యాజమాన్య విధానాలకు గాను సీబీఐపీ ఈ అవార్డును అందిస్తూ ఉంటుంది.