Tirumala: నేడు వైకుంఠ ఏకాదశి.. శ్రీవారి దర్శనానికి క్యూకట్టిన ప్రముఖులు!

  • భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు
  • అందరికీ సర్వ దర్శనమే
  • ప్రముఖుల్లో సుప్రీం సీజే, కర్ణాటక సీఎం, తెలంగాణ సీఎం భార్య, ఎమ్మెల్యే హరీశ్ రావు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజామున ప్రారంభమైన స్వామి వారి విశేష దర్శనం కోసం ఆదివారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో తిరుమల కొండలు కిక్కిరిసిపోయాయి. కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీని అధికారులు నిలిపివేసి అందరినీ సర్వదర్శనానికి పంపిస్తున్నారు.  ఈ ఉదయం 5 గంటల తర్వాత శ్రీవారి ధర్మదర్శనం ప్రారంభమైంది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు తరలి వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భార్య శోభ, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు  సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున తరలి  వచ్చారు.
Tirumala
Tirupati
Andhra Pradesh
vaikunta ekadasi

More Telugu News