prakasam barriage: ప్రకాశం బ్యారేజీకి వరదపోటు.. కాసేపట్లో దిగువకు నీటి విడుదల

  • పెథాయ్ తుపాను ప్రభావంతో వర్షాలు
  • బ్యారేజీకి భారీ ఎత్తున చేరుతున్న వరద నీరు
  • 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం
పెథాయ్ తుపాను నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీలో నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, బ్యారేజీ నుంచి కాసేపట్లో 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో, దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంత్ హెచ్చరించారు. ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, పెనమలూరు తహసీల్దార్లకు సూచించారు. ఈ విషయం గురించి నదీపరీవాహక ప్రాంతాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు.  
prakasam barriage
flood
vijayawada

More Telugu News