Chandrababu: ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
  • వారికి అన్నివిధాలా అండగా ఉంటాం
  • హామీ ఇస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్
నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం దొరకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, వారికి అన్నివిధాలా అండగా ఉండి, ఆదుకుంటామని హామీ ఇస్తున్నానని ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కాగా, ఏపీ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ వద్ద పీఎస్ గా పని చేస్తున్న భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
Chandrababu
Nalgonda District
koda
ap secretariat
accident

More Telugu News