dhanush: పట్టువీడని ధనుశ్ .. అదే రోజున సినిమా విడుదల ఖాయమట!

  • ధనుశ్ హీరోగా 'మారి 2'
  • ఈ నెల 21వ తేదీన విడుదల
  • అదే రోజున రానున్న 'పడి పడి లేచె మనసు'      
తమిళనాట మాస్ హీరోగా ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా ఆయన కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకువెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'మారి 2' సిద్ధమవుతోంది. గతంలో ఘనవిజయాన్ని సాధించిన 'మారి'కి ఇది సీక్వెల్. ఈ సినిమాలో ఆయన జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

తెలుగులో సాయిపల్లవి చేసిన 'పడి పడిలేచె మనసు' కూడా అదే రోజున థియేటర్లకు రానుంది. సాయిపల్లవి చేసిన రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తున్నాయన్న మాట. ఇది 'పడి పడి లేచె మనసు' నిర్మాతలకి కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఒక వారం ఆలస్యంగా విడుదల చేసుకోమని డిస్ట్రిబ్యూటర్లు కోరినా ధనుశ్ వినిపించుకోవడం లేదట. తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున తన సినిమా రావలసిందేనని అంటున్నాడట. ఇక ఇదే రోజున వరుణ్ తేజ్ 'అంతరిక్షం'కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. 
dhanush
sai pallavi

More Telugu News