jagan: వైసీపీ జగన్ ది కాదు.. ఎవరో రిజిస్టర్ చేయించుకుంటే జగన్ కొన్నారు: కళా వెంకట్రావు

  • తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొల్లగొట్టారు
  • వారానికి ఒక సారి కోర్టుకు వెళ్లే దొంగ
  • కోడికత్తి డ్రామాతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ (యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ) జగన్ ది కాదని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. వేరెవరో రిజిస్టర్ చేయించుకున్న పార్టీని జగన్ కొనుగోలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జగన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. వారానికి ఒక రోజు కోర్టుకు వెళ్లే దొంగ అంటూ మండిపడ్డారు. కోడి కత్తి డ్రామాలు ఆడుతూ, ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ చివరకు సర్కస్ పార్టీగా మిగిలి పోతుందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మెరుగైన పాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా కళా వెంకట్రావు చెప్పారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు.
jagan
YSRCP
kala venkata rao
Chandrababu
Telugudesam

More Telugu News