sandeep kishan: సందీప్ కిషన్ .. హన్సిక కొత్త చిత్రం ప్రారంభం

  • జి.నాగేశ్వర రెడ్డి నుంచి మరో హాస్యభరిత చిత్రం
  • టైటిల్ గా 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్'
  • కీలకమైన పాత్రలో భూమిక      
హాస్యరస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించడంలో 'జి.నాగేశ్వర రెడ్డి సిద్ధహస్తుడు. 'సీమశాస్త్రి' .. 'సీమ టపాకాయ్' .. దేనికైనా రెడీ' .. 'ఈడోరకం ఆడోరకం' సినిమాలు ఆయన దర్శక ప్రతిభకు అద్దం పడతాయి. అలాంటి ఆయన నుంచి మరో హాస్యభరితం చిత్రం రూపొందుతోంది .. ఆ సినిమా పేరే 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్'.సందీప్ కిషన్ కథానాయకుడిగా చేస్తున్న ఈ సినిమా ఈ రోజే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కథానాయికగా హన్సిక నటించనున్న ఈ సినిమాలో, భూమిక ఒక కీలకమైన పాత్రను పోషించనుంది. శ్రీనీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇటీవల కాలంలో సందీప్ కిషన్ కి వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఆయన వున్నాడు. 
sandeep kishan
hansika
bhoomika

More Telugu News