vijay devarakonda: షూటింగులో ప్రమాదం నుంచి బయటపడిన విజయ్ దేవరకొండ

  • షూటింగు దశలో 'డియర్ కామ్రేడ్'
  • మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ
  • ట్రైన్ సీన్ షూటింగులో ప్రమాదం
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. తాజాగా విజయ్ దేవరకొండపై ఒక సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యాడు. ఒక సీన్లో ఆయన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వేగంగా మెట్లు దిగివచ్చి కదులుతోన్న ట్రైన్ ఎక్కాలి. అలా పరిగెత్తుకొచ్చి ట్రైన్ ఎక్కబోయిన ఆయన పట్టుతప్పి పడిపోయాడు. దాంతో అక్కడి సిబ్బంది వెంటనే తేరుకుని ఆయనను పక్కకి లాగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి టీమ్ సభ్యులంతా షాక్ అయ్యారు. విజయ్ దేవరకొండ వెంటనే తేరుకుని 'ఫరవాలేదు' అని చెప్పడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ దేవరకొండ ఎడమ చేతికి .. కుడికాలుకి దెబ్బలు తగిలాయి. షూటింగ్ అనంతరం హోటల్ కి చేరుకున్న ఆయన, ఎడమ చేతికి తగిలిన దెబ్బలు చూపిస్తూ .. సోషల్ మీడియాలోఒక ఫోటో పోస్ట్ చేశాడు. 'లైఫ్ లో ఏదీ ఈజీగా రాదు' అంటూ ఒక కామెంట్ పెట్టాడు. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించనున్నాడు. 
vijay devarakonda

More Telugu News