Rajasthan: మొదటి సంతకం రైతుల రుణమాఫీ ఫైల్‌ పైనే: అశోక్‌ గెహ్లాట్‌

  • నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న గెహ్లాట్‌
  • తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • ఎన్నికల మేనిఫెస్టోను తు.చ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటన
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం రైతు రుణమాఫీపైనే పెట్టనున్నట్లు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కాబోయే సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం సాధించడంతో సోమవారం గెహ్లాట్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రైతుల రుణాలన్నీ రద్దుచేసి వారికి ఊరటకలిగిస్తామని తెలిపారు. ఇందుకోసం తొలి మంత్రివర్గ సమావేశంలోనే అవసరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ తు.చ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.
Rajasthan
ashok gehlat
farmers loan

More Telugu News