Virat Kohli: ఆట మధ్యలో నోటికి పనిచెప్పిన కోహ్లీ... అంతే ఘాటు సమాధానం ఇచ్చిన పైన్... రికార్డయిన ఆడియో వినండి!
- ఆస్ట్రేలియా అంటే రెచ్చిపోయే కోహ్లీ
- మూడో రోజు ఆటలో పైన్ తో మాటల యుద్ధం
- స్టంప్స్ మైక్ లో రికార్డయి వైరల్
సాధారణంగా ఆస్ట్రేలియా అంటేనే రెచ్చిపోయి తన బ్యాట్ కు పనిచెప్పే విరాట్ కోహ్లీ, ఈ దఫా తన నోటికి కూడా పని చెప్పాడు. సెంచరీ చేసి తన సత్తా చాటిన కోహ్లీ, ఆపై అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా అవుట్ అయి, అసహనంతో పెవీలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఆపై భారత వికెట్లు త్వరత్వరగా పడిపోగా, తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 43 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ పై కోహ్లీ నోరుపారేసుకున్నాడు. భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా, పైన్ అవుట్ కాకుండా తప్పించుకుంటుంటే, అతని వద్దకు వెళ్లిన పైన్, "మీరు ఇలా ఆడితే సిరీస్ 2-0గా మారుతుంది" అని అన్నాడు. దీనికి పైన్ సైతం అదే రీతిలో బదులిస్తూ, "ముందైతే బ్యాటింగ్ రావాలి కదా బిగ్ హెడ్" అంటూ కోహ్లీ ఉద్దేశాన్ని తిప్పి కొట్టాడు. వీరిద్దరి సంభాషణా, స్టంప్స్ మైక్ లో రికార్డుకాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. వారిద్దరి మాటలనూ మీరూ వినండి!

Exchange of words between Virat and Paine. #AUSvIND pic.twitter.com/vz6niE90tO
— Silly Point (@FarziCricketer) December 16, 2018