Narasimhan: చంద్రబాబు దగ్గరుండి తుపాను ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు: గవర్నర్

  • నిన్న రాత్రే చంద్రబాబుతో మాట్లాడా  
  • ముందస్తు చర్యలపై చర్చించాం
  • అధికారులను అప్రమత్తం చేశాం
పెథాయ్ తుపాను కోస్తాంధ్ర ప్రజలను కలవరపెడుతోంది. అయితే దీని కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను విషయమై నిన్న రాత్రే ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ముందస్తు చర్యలపై చర్చించామని తెలిపారు.

చంద్రబాబు తుపాను ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారని గవర్నర్ వెల్లడించారు. అధికారులను కూడా అప్రమత్తం చేశామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించామని గవర్నర్ స్పష్టం చేశారు.
Narasimhan
Chandrababu
Kostandra
Tirumala
Pethai cyclone

More Telugu News