Andhra Pradesh: ఎన్టీఆర్ కు లోతుగా కత్తి దింపి ఇప్పుడు ఎత్తైన విగ్రహం కడుతున్నారా?: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

  • అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం
  • రూ.406 కోట్లతో విగ్రహం, స్మారకం నిర్మాణం
  • చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డ విజయసాయిరెడ్డి
అమరావతిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతిలోని నీరుకొండలో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.406 కోట్ల వ్యయంతో విగ్రహంతో పాటు స్మారకాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సమర్పించిన డిజైన్లను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శలకు దిగారు. ‘స్వర్గీయ ఎన్టీఆర్ కు లోతుగా కత్తి దింపిన చంద్రబాబు, ఇప్పుడు అదే చేతితో ఎత్తయిన విగ్రహం కడుతున్నారు.. ఆహా’ అని వెటకారంగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో చంద్రబాబును విమర్శిస్తూ ఓ మెమెను పోస్ట్ చేశారు.
Andhra Pradesh
ntr
Telugudesam
statue
amaravati
Vijay Sai Reddy
YSRCP

More Telugu News