amaravathi: అమరావతిలో 10కే రన్‌.. 3,500 మంది హాజరు!

  • వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కార్యక్రమం
  • పిల్లల నుంచి వృద్ధుల వరకు హాజరు
  • ప్రతి ఆదివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్న సీఆర్‌డీఏ కమిషనర్‌
అమరావతి వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 10కే మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. మొత్తం 3500 మంది హాజరయ్యారు. అమరావతిలో జరుగుతున్న నూతన నిర్మాణాల మధ్య జరిగిన కార్యక్రమం ఆద్యంతం మంచి వాతావరణంలో కొనసాగింది. 10కే రన్‌, 10కే నడక పోటీల్లో పిల్లల నుంచి వృద్ధుల వరకు పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా పలువురు వాకర్స్‌ మాట్లాడుతూ అమరావతి గురించి ఇన్నాళ్లు వినడమేనని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం కలిగిందని వ్యాఖ్యానించారు. కాగా, సీఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ అమరావతి ప్రాశస్త్యాన్ని వివరించేందుకు ప్రతి ఆదివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
amaravathi
10k run
walkers association

More Telugu News