Miss India: 'వరల్డ్‌వైడ్‌' మిస్‌ ఇండియాగా అందాల భామ శ్రీ సైనీ

  • భారత సంతతి యువతుల మధ్య పోటీ
  • పాల్గొన్న 17 దేశాల సుందరీమణులు
  • రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా
ప్రపంచ వ్యాప్తంగా భారత సంతతి యువతుల మధ్య జరిగే మిస్‌ ఇండియా 'వరల్డ్‌ వైడ్‌' కిరీటం ఈ సంవత్సరం ఇండో అమెరికన్ శ్రీ సైనీ (22)సొంతమైంది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌ సిటీలో శనివారం నాడు జరిగిన 27వ మిస్ ఇండియా 'వరల్డ్ వైడ్' పోటీ జరుగగా, 17 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు. శ్రీ సైనీ తొలి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియా యువతి సాక్షి సిన్హా, బ్రిటన్‌ కు చెందిన అనూషా సరీన్‌ ఫస్ట్, సెకండ్ రన్నరప్ గా నిలిచారు. కాగా, శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండెకు చికిత్స జరిగినా, ఆరోగ్య కారణాల వల్ల ఆమె డ్యాన్స్‌ చేయకూడదని వైద్యులు హెచ్చరించినా, మనోనిబ్బరం కోల్పోని ఆమె, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని సొంతం చేసుకుంది.
Miss India
World wide Sri Sainy
Shree Sainy

More Telugu News