TRS: అరవై రెండేళ్ల యంగ్ టైగర్ రాములు నాయక్: కేటీఆర్

  • వైరాను అభివృద్ధి చేయాలని రాములు నాయక్ కోరారు
  • వైరా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తా
  • అభివృద్ధి చేసే బాధ్యతను నేను, ఎంపీ తీసుకుంటాం
అరవై రెండేళ్ల యంగ్ టైగర్ రాములు నాయక్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో రాములు నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాములు నాయక్ ఇటీవల తనను కలిసినప్పుడు తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారని, అదొక్కటే తన డిమాండ్ అన్నారని గుర్తుచేసుకున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించిన ప్రజలకు సేవల చేసుకునే అవకాశం, వారు అడిగిన పనులు చేసే అవకాశం తనకు కల్పించాలని కోరారని చెప్పారు. ఖమ్మం జిల్లా చుట్టూ వైరా నియోజకవర్గం అలముకుని ఉంటుంది కనుక పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని, అభివృద్ధి చేయాలని తనను కోరారని, అదే మాట తమ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పారని అన్నారు. వాళ్లిద్దరూ కోరిన విధంగా వైరా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసే బాధ్యతను తాను, ఎంపీ సమష్టిగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
TRS
ramul nayak
KTR
wyra
Telangana bhavan

More Telugu News