madakasira: కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది: తిప్పేస్వామి

  • నా నాలుగేళ్ల పోరాటం ఫలించింది
  • అసెంబ్లీ స్పీకర్ ని కలిసి ‘సుప్రీం’ తీర్పు ప్రతిని ఇచ్చాం
  • ఈరన్నపై ఏపీ, కర్ణాటకల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నియోజవర్గానికి  వైసీపీ నేత తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా పరిగణించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ల పోరాటం అనంతరం కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించమని అసెంబ్లీ స్పీకర్ ని కోరినట్టు వెల్లడించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని స్పీకర్ కు అందజేసినట్టు తిప్పేస్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఈరన్న గురించి ఆయన మాట్లాడుతూ, ఆయనపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందన్న విషయాలను తన ఎన్నికల అఫిడవిట్ లో ఈరన్న పేర్కొనలేదని అన్నారు.
madakasira
Telugudesam
YSRCP
eeranna
tippeswamy

More Telugu News