kcr: ఏపీలో బలమైన ప్రాంతీయ శక్తి రావాలని మా నాయకుడు, నేను బలంగా కోరుకుంటున్నాం: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ప్రాంతీయ శక్తి రావాలని తమ నాయకుడు కేసీఆర్, తాను బలంగా కోరుకుంటున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రజలకు ఏది మెరుగని తాము అనుకుంటున్నామో, సమయం, సందర్భం వచ్చినప్పుడు అది తప్పకుండా చెబుతామని స్పష్టం చేశారు.

దేశంలో ఏపీ కూడా అంతర్భాగమే కనుక అక్కడ ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంటే బాగుంటుందనేది సమయాన్ని అనుసరించి చెప్పాలి తప్ప, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదని, చంద్రబాబులా అభాసుపాలు అయితే బాగుండదని అన్నారు. కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నామో కూడా త్వరలోనే చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
kcr
KTR
TRS
Telangana

More Telugu News