alia bhatt: బన్నీ అంటే ఇష్టం .. ఆయనతో ఒక సినిమా చేస్తా: అలియా భట్

  • యూత్ లో అలియా భట్ కి మంచి క్రేజ్ 
  • తన స్థాయిని పెంచే పాత్రలకే అంగీకారం 
  • సౌత్ సినిమాలు చేయడానికి ఉత్సాహం  
బాలీవుడ్ కథానాయికలలో అలియా భట్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. తొలినాళ్లలోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ ను పెంచేసుకున్న ఆమె, ఆ క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళుతోంది. గ్లామర్ తోపాటు నటనకి ప్రాధాన్యత గల కథలను ఎంచుకుంటూ మంచి మార్కులు కొట్టేస్తోంది. తన స్థాయిని మరింతగా పెంచే కథలను మాత్రమే ఆమె అంగీకరిస్తోంది. అంతే కాదు సౌత్ సినిమాలు చేయడానికి కూడా ఆమె ఆసక్తిని చూపుతోంది.

తాజాగా ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకి ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి అలియా భట్ స్పందిస్తూ .. తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమనీ, ఆయనతో ఒక్క సినిమా అయినా చేస్తాను అని అంది. దీనిని బట్టి అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయం అల్లు అర్జున్ వరకూ వెళ్లి, తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
alia bhatt
allu arjun

More Telugu News