KTR: కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం గొప్ప నిర్ణయం:కడియం శ్రీహరి

  • ఓ నాయకుడిగా కేటీఆర్ నిరూపించుకున్నారు
  • ప్రతీ ఎన్నికల్లో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు
  • వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ధన్యవాదాలు  
కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం గొప్ప నిర్ణయమని, ఓ నాయకుడిగా ప్రజల ముందు ఆయన నిరూపించుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లో కేటీఆర్ తనదైన ముద్ర వేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ఒంటి చేత్తో విజయం సాధించిపెట్టారని ప్రశంసించారు. మంత్రిగా పరిశ్రమలు, ఐటీ శాఖలకు వన్నె తెచ్చారని, గొప్ప పారిశ్రామిక విధానం రూపొందించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చిన వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
KTR
TRS
Kadiam Srihari

More Telugu News