పోలవరం, పట్టిసీమ పేరెత్తడానికే జగన్ భయపడుతున్నారు : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
- దురుద్దేశంతోనే ముంపు మండలాలపై లేనిపోని పంచాయతీలు
- ప్రజల మేలు కోరే వారైతే కేసులు అడ్డుకోవాలి
- అభివృద్ధి చూసి మాట్లాడాలని హితవు
పొరుగున ఉన్న తెలంగాణలో కూర్చుని ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఎంపీలను బీజేపీకి అప్పగించి లాలూచీ పడ్డారని విమర్శించారు. కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ కారణంగా పంటలకు ఎటువంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.