kcr: కేసీఆర్ గారు అప్పజెప్పిన బాధ్యతను స్వీకరిస్తున్నా: కేటీఆర్

  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకం
  • వెల్లువెత్తుతున్న అభినందనలు
  • కేసీఆర్ పై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తానన్న కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ గారు అప్పగించిన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను స్వీకరిస్తున్నానని ట్వీట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ కు పార్టీ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
kcr
KTR
TRS
working president

More Telugu News