Andhra Pradesh: సెల్ఫ్ గోల్ కొట్టుకోవడంలో వైసీపీ నేతలు సిద్దహస్తులు.. టీఆర్ఎస్ గెలిస్తే సంబరాలేంటి?: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • టీఆర్ఎస్ ప్రత్యేకహోదాను అడ్డుకుంది
  • వారికే వైసీపీ నేతలు మద్దతు ఇస్తున్నారు
  • రాహుల్ ను ప్రధాని చేసేందుకు దేనికైనా రెడీ
తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఏపీలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో వైసీపీ టపాసులు కాల్చడం ఏంటని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదాను అడ్డుకున్న టీఆర్ఎస్ కు మద్దతుగా టపాసులు కాల్చడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా ఏపీ ఎడారిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై హైకమాండ్ ఆదేశాల మేరకు ముందుకు వెళతామని స్పష్టం చేశారు. సెల్ఫ్ గోల్ కొట్టుకోవడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
Andhra Pradesh
Congress
YSRCP
TRS
Telangana
tulasireddy

More Telugu News