YSjagan: జగన్‌ రాజకీయ నటుడు... ఆయనవి అర్థంలేని ఆరోపణలు: ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌

  • పాదయాత్ర పేరుతో డ్రామాలు అడుతున్నారు
  • దోపిడీ దారుడైన ఆయన నన్ను కబ్జాకోరు అనడం విడ్డూరం
  • తిత్లీ బాధితులను పరామర్శించని జగన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రస్తుతం రాజకీయ నటుడి అవతారం ఎత్తారని, ఎక్కడికి వెళితే అక్కడ నటిస్తూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను భూకబ్జాకు పాల్పడుతున్నట్లు జగన్‌ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు.

ప్రస్తుతం పాదయాత్ర పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిండా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్న జగన్‌ నన్ను కబ్జా కోరు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తిత్లీ తుపాన్‌తో శ్రీకాకుళం ప్రజలు అల్లాడిపోతే కనీసం పరామర్శించడానికి రాని జగన్‌ ముందు జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి పాదయాత్ర కొనసాగించాలని కోరారు.
YSjagan
kuna ravikumar
Srikakulam District

More Telugu News