Andhra Pradesh: చంద్రబాబుకు నా తడాఖా చూపిస్తా: అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

  • ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకత ఉంది
  • వైఎస్ జగన్ తరఫున ప్రచారం చేస్తా
  • ఉత్తరాదిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ విజయం
  • ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని, ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని దారుస్సలాంలో జరిగిన పార్టీ సభలో ప్రసంగించిన ఆయన, ఏపీలో బాబుపై వ్యతిరేక ఉందని, తన తడాఖా ఏంటో చంద్రబాబుకు చూపిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

వైకాపా అధినేత జగన్ తనకు మిత్రుడన్న అసదుద్దీన్, ఆయన తరఫున ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు కూడా రాబోవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కూడా తన ఉనికిని చాటుకోలేకపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అన్నారు. రాహుల్ గాంధీతో కలసి కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబు విఫలం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Telangana
Asaduddin Owaisi
Jagan
Chandrababu

More Telugu News