Saina Nehwal: సైనా-కశ్యప్ ల పెళ్లి సందడి ప్రారంభం.. వివాహ విందుకు చిరంజీవి, కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎంతో నిరాడంబరంగా వీరి పెళ్లి జరగనుంది. ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరవుతున్నారు. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో ఇరువురి గృహాలు సందడిగా మారాయి.

మరోవైపు, కశ్యప్ కు ఉపనయనం కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను కశ్యప్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 16వ తేదీన వివాహ విందు కార్యక్రమం ఉంటుంది. ఈ విందుకు మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోచ్ పుల్లెల గోపీచంద్ తదితర ప్రముఖులను సైనా, కశ్యప్ లు ఆహ్వానించారు.
  
Go Back to Shorts
Saina Nehwal
parupalli kashyap
marriage

More Telugu News