devineni Uma: తెలంగాణలో వైసీపీ పోటీ చేయకపోవడానికి కారణం ఇదే: దేవినేని ఉమా

  • కేసీఆర్ కు భయపడే వైసీపీ పోటీ చేయలేదు
  • పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసిన వారితో చేతులు కలుపుతున్నారు
  • నాగావళి-వంశధార నదుల అనుసంధానం జగన్ కు కనిపించడం లేదా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయపడే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి నిరోధకులందరూ ఒకటవుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసిన వారితో జగన్ చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని దేవినేని విమర్శించారు. అవిశ్వాసంపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు వైసీపీ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని... అయినా, జగన్ విమర్శిస్తున్నారని అన్నారు. నాగావళి-వంశధార నదుల అనుసంధానం ఆయనకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి జగన్ రాకపోవడంపై ఏపీలోని కుహనా మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. 
devineni Uma
kcr
jagan
polavaram

More Telugu News