Karnataka: పక్కింటి వివాహితతో పరారైన కొడుకు... పరువు తీశాడంటూ తల్లిదండ్రుల ఆత్మహత్య!

  • కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో ఘటన
  • దంపతులను నిందించిన గ్రామస్థులు
  • మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్య
తమ కుమారుడు పక్కింటి వివాహితతో సంబంధం పెట్టుకుని, ఆమెతో పాటు పరారు కావడంతో పరువు పోయిందని భావించిన అతని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని కనకపుర తాలూకా కల్లిగౌడన దొడ్డి ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సిద్ధరాజు (52) సాకమ్మ( 42) దంపతులుకాగా, వారికి మను అనే కుమారుడు ఉన్నాడు.

వారి పక్కింట్లో ఓ కుటుంబం నివాసం ఉండగా, ఆ ఇంటి గృహిణితో మను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బుధవారం నాడు ఆమెను తీసుకుని మను పరారయ్యాడు. ఆపై గ్రామస్తులు సిద్ధరాజు, సాకమ్మలను నిందించగా, వివాహిత కుటుంబ సభ్యులు ఇంటి ముందుకు వచ్చి గొడవకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన వారు, నిన్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
Karnataka
Housewife
Lover
Sucide

More Telugu News