MAA: కేసీఆర్ ప్రధాని కావడం పక్కా: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

  • సీఎంను కలిసిన ‘మా’సభ్యులు
  • రెండోసారి సీఎం అయినందుకు అభినందనలు
  • అన్నీ అనుకూలిస్తే కేసీఆరే పీఎం అన్న కేతిరెడ్డి
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని కావడం పక్కా అని సినీ దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన ప్రధాని అవుతారని కేతిరెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ను గురువారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేసన్ ఆధ్వర్యంలో (మా) సెక్రటరీ నరేశ్, హస్యనటుడు అలీ, కేతిరెడ్డి తదితరులు కలిసి శాలువా కప్పి సన్మానించి అభినందించారు.
MAA
Naresh
Ali
Tollywood
Kethireddy
KCR
Telangana

More Telugu News