vijay malya: విజయ్ మాల్యా కేసు.. బ్రిటన్ హోం శాఖకు తీర్పు ప్రతి

  • మాల్యాను భారత్ కు తిరిగి పంపాలని కోర్టు తీర్పు
  • బ్రిటన్ హోం శాఖకు అందిన తీర్పు ప్రతి
  • తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల గడువు
భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను ఇండియాకు తిరిగి పంపాలని బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించిన ప్రతి రెండు రోజుల క్రితమే బ్రిటన్ హోం శాఖ కార్యాలయానికి అందింది. ఈ విషయాన్ని సదరు శాఖ స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆధారంగానే బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావిద్ తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల గడువు ఉంది. సాజిద్ నిర్ణయం వెలువడ్డాక ఇక్కడి హై కోర్టులో మాల్యా అప్పీల్ చేసుకోవచ్చు. 
vijay malya
britain
home minister
sajid javid
west minister court

More Telugu News