kcr: కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

  • సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కి అభినందనలు
  • ఐదేళ్ల పదవీకాలం చక్కగా కొనసాగాలన్న మోదీ
  • కేసీఆర్ కు అభినందనలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్
తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి సీఎం అయిన కేసీఆర్ కు అభినందనలు అందుతున్నాయి. కేసీఆర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కి అభినందనలు తెలియజేస్తున్నానని, ఐదేళ్ల పదవీకాలం చక్కగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రమాణ స్వీకారం అనంతరం ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ ని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు కలిసి అభినందించారు.
kcr
modi
rajnath
TRS
bjp

More Telugu News