bhatti vikramarka: స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం: భట్టి విక్రమార్క

  • గ్రామ స్వరాజ్యం కోసం కార్యకర్తలు పాటుపడాలి
  • తెలంగాణలో భవిష్యత్ లో అధికారంలోకొచ్చేది మేమే
  • విజయం సాధించిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు అభినందనలు
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని టీ-కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం కోసం పార్టీ కార్యకర్తలందరూ పాటుపడాలని కోరారు. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడొచ్చిన ఫలితాలే భవిష్యత్ లో వస్తాయని ఎవరైనా అనుకోవడం మూర్ఖత్వమేనని అన్నారు. భవిష్యత్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు భట్టి తన అభినందనలు తెలియజేశారు. 
bhatti vikramarka
kcr
TRS
t-congress

More Telugu News