Telugudesam: ఏపీలో మళ్లీ మేమే అధికారంలోకొస్తాం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ఏపీలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే విజయం సాధిస్తాం
  • మా హయాంలో అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే విజయం సాధిస్తామని, అధికారంలోకొస్తామని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని అభిప్రాయపడ్డారు.

 ఈ సందర్భంగా జగన్, పవన్ కల్యాణ్ లపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తే వీళ్లిద్దరూ సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడానికి వీలులేదని చెప్పిన టీఆర్ఎస్ గెలిస్తే సంబరాలు చేసుకుంటారా? అని మండిపడ్డారు. 
Telugudesam
gornatla
TRS
Jagan
pavan

More Telugu News