kcr: కేసీఆర్ ను పర్సనల్ గా కలుస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • ప్రమాణస్వీకారం సందర్భంగా కేసీఆర్ ను కలవలేకపోయా
  • పర్సనల్ గా కలిసి శుభాకాంక్షలు తెలుపుతా
  • రాష్ట్రాన్ని కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లాలి
ప్రమాణస్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం కుదరలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హాల్ పూర్తిగా నిండిపోయిందని... కార్యక్రమం పూర్తి కాగానే కేసీఆర్ వెళ్లిపోయారని చెప్పారు. సీఎంతో టైమ్ తీసుకుని, పర్సనల్ గా కలిసి శుభాకాంక్షలు తెలుపుతానని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినట్టే... రానున్న ఐదేళ్లపాటు తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున కేవలం రాజాసింగ్ మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. గోషామహల్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 
kcr
raja singh
TRS
bjp

More Telugu News