vidyabalan: జయలలిత బయోపిక్ లో ఎంజీఆర్ గా అరవిందస్వామి

  • జయలలిత పాత్రలో విద్యాబాలన్ 
  • లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణం 
  • ఫిబ్రవరి 24వ తేదీన లాంచ్  
తమిళనాడు రాజకీయాలను జయలలిత ఎలా శాసించారో .. ప్రజలను ఎంతగా ప్రభావితం చేశారో తెలిసిందే. వెండితెర కథానాయికగా .. సాహసోపేతమైన నాయకురాలిగా ఆమె ఎంతోమంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి జయలలిత బయోపిక్ ను రూపొందించడానికి తమిళనాడులో దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు.

దర్శకురాలు ప్రియదర్శిని .. నిత్యామీనన్ ప్రధాన పాత్రగా 'ది ఐరన్ లేడీ' సినిమా చేస్తున్నారు. ఇక ఏఎల్ విజయ్ కూడా తన దర్శకత్వంలో అమ్మ జీవితంలోని అనూహ్యమైన మలుపులను ఆసక్తికరంగా రూపొందించడానికి రంగంలోకి దిగాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో జయలలిత పాత్రను విద్యాబాలన్ చేయనుంది. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రకి గాను అరవింద్ స్వామిని ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. జయలలిత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.     
vidyabalan
aravind swami

More Telugu News