vishnu: మంచువారి బ్యానర్ నుంచి 'ఫసక్'

  • 'ఫసక్' టైటిల్ ను రిజిస్టర్ చేయించిన విష్ణు 
  • హీరో ఎవరనే విషయంలో రావలసిన క్లారిటీ 
  • త్వరలోనే పూర్తి వివరాలు    
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ, యథాలాపంగా 'ఫసక్' అనే పదం వాడేశారు. అంతే .. అనూహ్యమైన స్థాయిలో ఆ పదం పాప్యులర్ అయిపోయింది. ఈ పదానికి అర్థం తెలుసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. ఈ పదం గురించి సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతగా పాప్యులర్ అయిన 'ఫసక్' ఇప్పుడు సినిమా టైటిల్ గా మారుతోంది.

మంచు విష్ణు తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 'ఫసక్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కథానాయకుడిగా విష్ణు చేస్తాడా .. నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది. 
vishnu

More Telugu News