Andhra Pradesh: సుప్రీంకోర్టులోనూ టీడీపీకి షాక్.. మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ప్రకటన!
- హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం
- తప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చారని వ్యాఖ్య
- వైసీపీ నేత ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టీకరణ
తెలుగుదేశం పార్టీ నేత, మడకశిర ఎమ్మెల్యే ఈరన్నకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మడకశిర ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ నేత తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
కర్ణాటకలో ఉన్న రెండు కేసులతో పాటు కుటుంబానికి సంబంధించిన వివరాలను ఈరన్న ఎన్నికల అఫిడవిట్ లో చెప్పలేదని తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లబోదని స్పష్టం చేసింది. దీంతో ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.