Andhra Pradesh: మొదలైన పార్లమెంటు.. ఆందోళనకు దిగిన తెలుగుదేశం ఎంపీలు!

  • రెండో రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్
  • మోదీ దేశాన్ని మోసం చేశారని మండిపాటు
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈరోజు టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, విభజన హామీలు అమలు చేయాలని నినాదాలు చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. టీజీ వెంకటేశ్, అశోక్ గజపతి రాజు, రామ్మోహన్ నాయుడు, మురళీ మోహన్, గల్లా జయదేవ్, శివప్రసాద్ సహా పలువురు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. మోదీ దేశాన్ని ముంచేశాడని ఆరోపించారు. 2019లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
parliament
start
Telugudesam
MPS
agitation
2nd day

More Telugu News