Allu Arjun: బన్నీ .. విజయ్ దేవరకొండలను సెట్ చేయాలనుకున్నారట!

  • బన్నీతో విజయ్ దేవరకొండకి సాన్నిహిత్యం 
  • ఇద్దరి మార్కెట్ పై దర్శకుల దృష్టి 
  • సున్నితంగా తిరస్కరించిన హీరోలు  
స్టార్ హీరోగా తాను ఏమిటనేది అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా 'గీత గోవిందం' సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. విజయ్ దేవరకొండ గత రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చాడు. విజయ్ దేవరకొండ ప్రత్యేకతను గురించి .. ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన తీరును గురించి అల్లు అర్జున్ ఆ వేదికలపై ప్రస్తావించాడు. ఈ ఇద్దరికీ గల క్రేజ్ ను .. మార్కెట్ ను దృష్టిలోపెట్టుకుని, వీళ్ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ చేయాలని కొంతమంది దర్శకులు భావించారట. ఎవరికి వారు మంచి లైన్ తయారు చేసుకుని వాళ్లకి వినిపించడానికి గట్టిప్రయత్నాలే చేశారట. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేవీ లేవని ఇద్దరూ కూడా సున్నితంగా తిరస్కరించినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాతో బిజీగా ఉంటే, త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి బన్నీ రెడీ అవుతున్నాడు. 
Allu Arjun
vijay devarakonda

More Telugu News