పింఛన్ డబ్బుల కోసం నానమ్మను గొడ్డలితో నరికి చంపిన మనవడు
- పొరుగింటి వృద్ధురాలిపైనా దాడి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- వికారాబాద్ జిల్లాలో ఘటన
డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోకి వెళ్లాడు. గొడ్డలితో తిరిగొచ్చి మెడపై నరికాడు. ఈ ఘటనలో బిచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బిచ్చమ్మ కేకలు విని వచ్చిన పొరుగింటి అంతమ్మ (73) శివకుమార్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఆమెపైనా దాడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన అంతమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.