sara ali Khan: బుర్ఖా ధరించి సినిమాకు వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్!

  • ‘కేదారనాథ్’తో ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్
  • వరదల నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథ
  • ఇన్‌స్టాగ్రాం ద్వారా విషయం వెల్లడి
తన సినిమాపై స్పందన తెలుసుకునేందుకు హీరోయిన్ ఏకంగా బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లింది. ప్రేక్షకులకు ఏమాత్రం అనుమానం రాకుండా సినిమా చూసింది. అభిషేక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేదారనాథ్’ చిత్రంతో సారా అలీఖాన్ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కథానాయకుడిగా నటించారు. కేదారనాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది.

శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. తన సినిమాపై ప్రేక్షకుల స్పందనను స్వయంగా తెలుసుకోవాలనుకున్న సారా బుర్ఖా వేసుకుని ముంబయిలోని ఓ థియేటర్‌కి వెళ్లింది. ప్రేక్షకులకు అనుమానం రాకుండా వారి మధ్యే కూర్చొని తన తొలి చిత్రాన్ని ఎంజాయ్ చేసింది. అనంతరం  సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడిస్తూ థియేటర్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది.
sara ali Khan
Kedaranath
Sushanth singh Rajputh
Theator
Mumbai

More Telugu News