Priya Prakash Warrior: మరోసారి వార్తల్లో నిలిచిన ప్రియా ప్రకాశ్ వారియర్!

  • గూగుల్‌లో సెర్చ్ చేసిన వారిలో ప్రియకు మొదటి స్థానం 
  • రెండో స్థానంలో సప్నా చౌదరి
  • తర్వాతి స్థానాల్లో ఆనంద్ అహుజా, ప్రియాంక చోప్రా 
స్టయిల్ గా కన్నుగీటి కుర్రకారును బాగా ఆకట్టుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో ఆమె చక్కని హావభావాలు పలికించి దేశవ్యాప్తంగా పాప్యులర్ అయిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్‌లో కుర్రకారు బాగా వెదికిందట. పర్యవసానంగా 2018లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా ప్రియ నిలిచింది.

రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉన్నారు. మూడు, నాలుగు స్థానాల్లో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. ఇంకా వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా పంపాలి? ఫోన్‌ నెంబరుతో ఆధార్‌ను ఎలా లింక్‌ చేయాలి? సిరియాలో ఏం జరుగుతోంది? రంగోలీ ఎలా వేయాలి? వీటితో పాటు సెక్షన్‌ 377 అంటే ఏంటి? బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి? మొబైల్‌ నెంబర్‌ను ఎలా పోర్ట్‌ చేసుకోవాలి? కికి ఛాలెంజ్‌ అంటే ఏంటి? వంటి అంశాలను నెటిజన్లు అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేశారు.  
Priya Prakash Warrior
Oru Adar Love
Sapna chowdary
Anand Ahuja
Priyanka Chopra

More Telugu News