kcr: రైతు సంక్షేమం కోసం కేసీఆర్ చాలా చేశారు: టీడీపీ ఎంపీ జేసీ ప్రశంస

షార్ట్స్‌లో చూడండి
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ చాలా చేశారని ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసించారు. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా రైతులను మెప్పించిన వారిదే అధికారమని అన్నారు. ఇది రైతు విజయమని, సంచులు, పంచ్ లతో లాభం లేదని వ్యాఖ్యానించారు.

దేశంలో ఎవరూ చేయనట్టుగా రైతులకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటివన్నీ కేసీఆర్ ని  రైతులకు చేరువ చేశాయని చెప్పిన జేసీ, హైదరాబాద్ లో సూటు, బూటు వేసుకుని తిరిగేవాళ్లు ఓటేసేందుకే వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి తమకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు, తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ చేసిన వ్యంగ్యాస్త్రాలపైనా జేసీ స్పందించారు. ఏపీలో కేసీఆర్  ప్రచారం చేస్తే తమ పార్టీకే లాభం చేకూరుతుందని అన్నారు.  
Go Back to Shorts
kcr
TRS
Telugudesam
jc
Andhra Pradesh
Telangana

More Telugu News