l ramana: రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: ఎల్ రమణ

  • కూటమి అభ్యర్థులు వీరోచిత పోరాటం చేశారు
  • అధికారపక్ష దూకుడును కొంతవరకు అడ్డుకున్నాం
  • టీడీపీపై బీజేపీ కుట్రలకు పాల్పడుతోంది
దేశ రాజకీయాల్లో పెను మార్పులకు తెలంగాణ ప్రజాకూటమి దోహదపడుతుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీరోచిత పోరాటం చేశారని చెప్పారు. అధికారపక్ష దూకుడును కొంతవరకు అడ్డుకున్నామని తెలిపారు. టీటీడీపీకి రాజకీయాలు కొత్త కాదని అన్నారు. గెలుపు, ఓటములు రాజకీయాల్లో సాధారణమే అని చెప్పారు.

రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీపై బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని, తమను విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని అన్నారు. ప్రజాస్వామ్య గొంతుకగా టీడీపీ పని చేస్తుందని తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
l ramana
Telugudesam
bjp
TRS
kcr

More Telugu News