kcr: మా పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారు: సీఎం కేసీఆర్

  • లెక్క ప్రకారం 95- 106 సీట్లు మేము గెలవాల్సి ఉంది
  • ఖమ్మంలో అంతర్గత విభేదాల వల్లే ఓటమిపాలయ్యాం
  • గెలవని అభ్యర్థులూ నాకు ముఖ్యమే
మా పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. మీడియాతో కేసీఆర్ చిట్ చాట్ చేస్తూ.. లెక్క ప్రకారం 95 నుంచి 106 సీట్లు తాము గెలవాల్సి ఉందని అన్నారు. ఖమ్మంలో అంతర్గత విభేదాల వల్లే అక్కడ తాము ఓటమిపాలయ్యామని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులే కాదు గెలవని వాళ్లు కూడా తనకు ముఖ్యమేనని, వాళ్లని కూడా కలిసి మాట్లాడాలని చెప్పారు. సభలో తానే సీనియర్ ఎమ్మెల్యేను అని, తన తర్వాత రెడ్యానాయక్, ఎర్రబెల్లి సీనియర్లు అని చెప్పారు.  
kcr
TRS
khammam
mim
owaisi

More Telugu News