chandrasekhar yeleti: చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రానా?
- ఎమోషన్ ప్రధానంగా సాగే కథలు
- మాస్ అంశాల మేళవింపు తక్కువ
- మైత్రీ మూవీ మేకర్స్ పై తాజా చిత్రం
విభిన్నమైన కథలను ఎంచుకుని .. విలక్షణమైన పాత్రలను తెరపై ఆవిష్కరిస్తూ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన సినిమాలు కొనసాగుతాయి. ఆయన సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను ఆకర్షించే అంశాలు తక్కువగా ఉంటాయి. అందువల్లనే భారీ సక్సెస్ లు పలకరించకపోయినా, అభిరుచి కలిగిన దర్శకుడిగా ఆయనకి ప్రత్యేకమైన స్థానం వుంది.
అలాంటి చంద్రశేఖర్ యేలేటి ఒక మంచికథను సిద్ధం చేసుకుని, సాయిధరమ్ తేజ్ తో చేయాలనుకున్నారు. అసలే ఈ మధ్య కాలంలో సక్సెస్ లు లేని తేజు, ఈ ప్రాజెక్టుపట్ల అంతగా ఆసక్తిని చూపలేదు. దాంతో నాని .. నితిన్ వంటి కథానాయకులను కూడా సంప్రదించారు. వాళ్లు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో, ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా చేయడానికి రానా అంగీకరించాడనీ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.