kcr: కేసీఆర్ తో పాటు మరొక్కరు మాత్రమే ప్రమాణస్వీకారం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. కేసీఆర్ తో పాటు ఐదుగురు లేదా 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, కేవలం ఒక్కరు మాత్రమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఆ ఒక్కరు ఎవరనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక సీనియర్ మంత్రి కేసీఆర్ తో పాటు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఎస్సీ లేదా మైనార్టీ సామాజికవర్గానికి ఈ అవకాశం లభిస్తుందని సమాచారం.
Go Back to Shorts
kcr
oath
minister
TRS
telangana

More Telugu News