kcr: కేసీఆర్ తో ఒవైసీ భేటీ.. కేబినెట్ ఏర్పాటుపై ద్విముఖ వ్యూహంతో సీఎం

  • పలు అంశాలపై చర్చిస్తున్న కేసీఆర్, ఒవైసీ
  • ఐదుగురు లేదా 14 మందితో కేబినెట్
  • పార్లమెంటు ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి మంత్రివర్గం
ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో వీరి సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు, మంత్రివర్గ ఏర్పాటుపై కేసీఆర్ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

ఐదుగురు లేదా 14 మంది మంత్రులతో మాత్రమే ప్రమాణస్వీకారం చేయించవచ్చని విశ్వసనీయ సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయిలో కేబినెట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. కాసేపట్లో ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతోంది. 
kcr
Asaduddin Owaisi
cabinet
telangana
Oath

More Telugu News