komati reddy: ఓటమిని పట్టించుకోని కోమటిరెడ్డి.. జిమ్ లో ఉల్లాసంగా..!

  • ఎన్నికల్లో ఓటమిపాలైన కోమటిరెడ్డి
  • ఓటమి నుంచి వెంటనే కోలుకున్న కాంగ్రెస్ నేత
  • జిమ్ కు వెళ్లి, ఉల్లాసంగా వర్కౌట్లు చేసిన వైనం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే... ఓటమిపాలైన వారు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలాంటి బలమైన నేత కూడా ఓటమిపాలు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఓటమిని ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రజలు మార్పు కోరుకున్నారని భావించిన ఆయన... ఎప్పటిలాగానే ఈ ఉదయం తన దినచర్యను ప్రారంభించారు. హైదరాబాదులోని జిమ్ కు వెళ్లిన ఆయన అందరితో కలసి ఉల్లాసంగా వర్కౌట్లు చేశారు. వీడియో చూడండి.
komati reddy
gym
congress

More Telugu News