Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మాదే అతిపెద్ద పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్నే పిలవండి: గవర్నర్‌కు కాంగ్రెస్ లేఖ

  • మధ్యప్రదేశ్‌లో 115 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
  • మ్యాజిక్ మార్కుకు ఒక్క సీటు దూరంలో ఆగిపోయిన వైనం
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా లేఖ
మధ్యప్రదేశ్ లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 115 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 108 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందగా, బీఎస్పీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 115 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ మార్కుకు ఒక్క సీటు దూరంలో ఆగిపోయింది.

అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆ  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు లేఖ రాశారు. తమకు స్వతంత్రుల మద్దతు కూడా ఉందని, కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. అధికారిక ఫలితాలు వెలువడిన వెంటనే తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా కమల్‌నాథ్ గవర్నర్‌ను కోరారు.
Madhya Pradesh
Congress
Kamalnath
Governor
Anandiben patel
BJP

More Telugu News